
జనరల్

సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రౌండ్స్‌లో కేంద్ర సాయుధ దళాలు నిర్వహించిన కవాతు (పరేడ్) రిహార్సల్స్‌ను ఆయన ప్రత్యక్షంగా వీక్షించారు. పరేడ్‌లో ప్రదర్శించిన విన్యాసాలను పరిశీలించారు.
వేడుకల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపులు, వీఐపీ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో కిషన్ రెడ్డి చర్చించారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేడుకలను వైభవంగా, ఎలాంటి లోపాలు లేకుండా విజయవంతంగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!