
జనరల్

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై రాష్ట్ర అభివృద్ధి, విద్యా మౌలిక వసతులు, మూలధన వ్యయాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా “Scheme for Special Assistance to States for Capital Investment (SASCI)” కింద తెలంగాణకు అదనంగా రూ.5,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయం మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, గ్రామీణ మౌలిక వసతులు, మానవ వనరుల అభివృద్ధి రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న భారీ పెట్టుబడులు, సంక్షేమ కార్యక్రమాల గురించి కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!