
జనరల్

దక్షిణ ఒడిశా భూభాగంపై వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది ప్రస్తుతం ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. రేపు ఉదయానికి వాయుగుండం క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో నేడు, రేపు ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నేడు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే సూచనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, కాలువల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!