
జనరల్

విరాట్ కోహ్లీతో కలిసి అండర్-19 క్రికెట్ ఆడిన మాజీ క్రికెటర్ అమన్‌ప్రీత్ సింగ్ గిల్ బుధవారం రాత్రి ఆకస్మికంగా మరణించారు. 36 ఏళ్ల అమన్‌ప్రీత్ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆయన మరణ వార్తతో క్రికెట్ వర్గాల్లో విషాదం నెలకొంది. పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అమన్‌ప్రీత్, ఆరు ప్రథమశ్రేణి మ్యాచ్‌లలో 11 వికెట్లు సాధించారు. తొలి ఐపీఎల్ సీజన్లో పంజాబ్ జట్టులో కూడా చోటు దక్కించుకున్నారు.
అమన్‌ప్రీత్ అకాల మరణంపై విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్‌తో పాటు పంజాబ్ క్రీడా సంఘం, పంజాబ్ జట్టు సంతాపం ప్రకటించాయి. ఆటను ఎంతో ప్రేమించే వ్యక్తి అని యువరాజ్ సింగ్ గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం కలగాలని విరాట్ కోహ్లీ ప్రార్థించారు. ఆటకు దూరమైన తర్వాత అమన్‌ప్రీత్ పంజాబ్ సీనియర్ ఎంపిక కమిటీలో సభ్యుడిగా కూడా సేవలందించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!