

నివిన్ పౌలీ, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన బెత్లెహెం కుడుంబ యూనిట్ ఇప్పుడు తెలుగు, తమిళ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ప్రేమలు ఫేమ్ గిరీష్ ఏడీ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ సినిమా మలయాళంలో ఆగస్టు 21న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం ప్రస్తుతం రూ.250 కోట్ల మార్క్ వైపు దూసుకెళ్తోంది. కేరళలో ఇప్పటివరకు సుమారు రూ.78 కోట్ల గ్రాస్ సాధించినట్లు సమాచారం. ఇదే జోరు కొనసాగితే అక్కడ రూ.100 కోట్ల మార్క్ అందుకునే అవకాశముంది.
తెలుగు డబ్బింగ్ వెర్షన్ సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. తమిళ వెర్షన్ కూడా అదే సమయంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రి మూవీ మేకర్స్ నేరుగా తెలుగు డబ్బింగ్ చేసి విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రేమ, కామెడీ, కుటుంబ అనుబంధాలతో తెరకెక్కిన ఈ సినిమాకు యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనూ మలయాళ సినిమాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. తెలుగు, తమిళ వెర్షన్లు కూడా విజయవంతమైతే రూ.300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!