
రాజకీయాలు

విజయవాడ–అమరావతి మధ్య రాకపోకలను మరింత సులభతరం చేసేలా కృష్ణానదిపై సిగ్నేచర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధమైంది. సుమారు రూ.1,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని ప్రణాళిక రూపొందించారు. ప్రకాశం బ్యారేజీ, రైల్వే బ్రిడ్జి మధ్య ప్రాంతంలో బ్రిడ్జిని నిర్మించేలా ప్రతిపాదించారు.
సుమారు 1.10 కిలోమీటర్ల పొడవుతో ఆరు లేన్ల రహదారితో బ్రిడ్జిని నిర్మించనున్నారు. వాహనాల రాకపోకలకు మెరుగైన కనెక్టివిటీ కల్పించడంతో పాటు బ్రిడ్జికి ఇరువైపులా ఫుట్‌పాత్‌లు, ప్రత్యేక సైకిల్ ట్రాక్‌లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు అమలైతే విజయవాడ–అమరావతి మధ్య రవాణా సదుపాయాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!