

మాస్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలకు సొంత రాష్ట్రంలో భారీ ఓపెనింగ్స్ రావడం సాధారణం. అయితే రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ మాత్రం కర్ణాటకలో అంచనాలకు భిన్నమైన ఫలితాన్ని అందుకుంటున్నట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. యష్‌కు ఉన్న క్రేజ్‌ను బట్టి ఈ సినిమా కర్ణాటకలో సులభంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుంటుందని భావించారు. కానీ మొదటి రోజు మంచి వసూళ్లు సాధించిన తర్వాత రెండో రోజు నుంచే కలెక్షన్లలో గణనీయమైన తగ్గుదల కనిపించినట్లు సమాచారం. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ మార్క్ చేరుకోలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది.
కన్నడ మార్కెట్‌లో నిరాశపరిచినప్పటికీ హిందీ బెల్ట్‌లో మాత్రం టాక్సిక్ కొంత మెరుగైన ప్రదర్శన కనబరిచినట్లు తెలుస్తోంది. తెలుగులోనూ మొదటి రోజు సాలిడ్ ఓపెనింగ్ వచ్చినా, రెండో రోజు నుంచి షోలు తగ్గినట్లు సమాచారం. దీంతో తెలుగు వెర్షన్ కూడా బయ్యర్లకు నష్టాలను మిగిల్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సొంత రాష్ట్రంలోనే రూ.100 కోట్ల గ్రాస్ దాటకపోవడం యష్ అభిమానులను, ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సినిమాపై ఉన్న భారీ అంచనాలతో పోలిస్తే ఈ వసూళ్లు తక్కువగానే కనిపిస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!