

తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై ఈ రోజు ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) చైర్మన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సేవా భవన్‌లో జరిగే ఈ భేటీలో తెలంగాణ, మహారాష్ట్ర జలవనరుల శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వరుస ప్రయత్నాల నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు అయింది.
ప్రాణహిత నదిపై ప్రతిపాదించిన బ్యారేజీ ఎత్తుపై ఇరు రాష్ట్రాల మధ్య కీలక చర్చ జరగనుంది. గతంలో మహారాష్ట్ర 148 మీటర్ల ఎత్తుకు అంగీకరించగా, తెలంగాణ ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తుకు అనుమతి కోరుతోంది. ఈ ఎత్తులో నీటిని గ్రావిటీ ద్వారా తరలించడంతో పాటు విద్యుత్ వ్యయాన్ని తగ్గించవచ్చని తెలంగాణ వాదిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మే 26న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు, జూన్ 11న ప్రధాని మోదీకి, ఆగస్టు 5న కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌కు ఈ అంశంపై లేఖలు రాసినట్లు అధికారిక, వార్తా వర్గాలు తెలిపాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!