

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. అభ్యర్థుల ఎంపిక కోసం రాష్ట్రస్థాయి కమిటీని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఏర్పాటు చేశారు. రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు జేడీ శీలం, మస్తాన్ వలీ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేయనుంది. స్థానిక ఎన్నికల సన్నద్ధతపై షర్మిల సోమవారం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లు, జిల్లా అధ్యక్షులతో జూమ్ సమావేశం నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా అర్హత, బలమైన అభ్యర్థులను గుర్తించడంతో పాటు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరేవారికి ప్రాధాన్యం ఇవ్వాలని షర్మిల సూచించారు. అధికార పార్టీ బలవంతపు ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తే వాటిని అడ్డుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికార పార్టీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని పేర్కొన్న ఆమె, స్థానిక ఎన్నికల అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న జిల్లా కమిటీలు, ఇన్‌చార్జీల నియామకాలను రెండు రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!