
జనరల్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ బోధి పెవిలియన్లో ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహా పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీని నెట్ జీరో సిటీ తరహాలో, అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని సీఎం అధికారులకు ఆదేశించారు.
ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తయ్యాకే భూ కేటాయింపులు జరగాలని, ప్రపంచ స్థాయి సంస్థలను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని సీఎం సూచించారు. 1500 ఎకరాల్లో డేటా సిటీ ఏర్పాటు, ఇన్వెస్ట్ తెలంగాణ కోసం ప్రత్యేక సెల్, వెబ్సైట్, లోగో రూపకల్పన, బుల్లెట్ ట్రైన్ భూసేకరణ, ద్వితీయ శ్రేణి నగరాల్లో జీసీసీల ఏర్పాటు వంటి కీలక అంశాలపై కూడా సీఎం దిశానిర్దేశం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!