

ఆధునికీకరణ, పట్టణీకరణతో భవిష్యత్‌లో మరిన్ని సవాళ్లు ఎదురవుతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. సచివాలయంలో జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆయన గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి అంశాలపై చర్చించారు. కమిటీ చైర్మన్ మాగుంట శ్రీనివాసులురెడ్డి, సీఎస్ రామకృష్ణారావు సహా ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు.
హైదరాబాద్‌ను సిగ్నల్-ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం తెలిపారు. త్రీ-లెవెల్ ట్రాఫిక్ విధానం, మల్టీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, మల్టీ లెవెల్ పార్కింగ్ వంటి అంశాలపై దృష్టి సారించినట్లు చెప్పారు. అభివృద్ధిని క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు ప్రాంతాలుగా విభజించినట్లు వివరించారు. అలాగే తెలంగాణ రైజింగ్-2047 మాస్టర్ ప్లాన్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి మార్గదర్శకమని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!