
జనరల్

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర త్రివేణీ సంగమ క్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 21 నుంచి వచ్చే నెల 1 వరకు జరగనున్న “సరస్వతి అంత్య పుష్కరాల” మహోత్సవానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆలయ అర్చకులు, ఉన్నతాధికారులు కలిసి ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వేదాశీర్వచనం, స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, దేవస్థానం ఈవో మహేష్ పాల్గొన్నారు. ఈ పవిత్ర ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!