

తిరుమలలో జీవ వైవిధ్య పరిరక్షణకు టీటీడీ చేపడుతున్న చర్యలు విశేష ఫలితాలను ఇస్తున్నాయి. పవిత్ర శేషాచలం కొండల్లో 89.40 శాతం పచ్చదనాన్ని సాధించినట్లు టీటీడీ ప్రకటించింది. అడవుల పరిరక్షణ, స్థానిక వృక్ష జాతుల పునరుద్ధరణ కోసం నిరంతరం చేపడుతున్న సంరక్షణ కార్యక్రమాల ఫలితంగానే ఈ స్థాయి గ్రీన్ కవర్ సాధ్యమైందని వెల్లడించింది. తిరుమలలో పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడేందుకు టీటీడీ తీసుకుంటున్న చర్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి.
టీటీడీ సాధించిన ఈ ఘనతపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. భారతీయ సంప్రదాయాలు ప్రకృతిని పవిత్రంగా భావిస్తాయని, అడవులు, వన్యప్రాణులను రక్షించడం దైవసేవతో సమానమని ఆయన పేర్కొన్నారు. శేషాచలం కొండల్లో స్థానిక జాతుల పరిరక్షణ, పచ్చదనం పెంపు కోసం టీటీడీ చేస్తున్న కృషి భవిష్యత్ తరాలకు మరింత ఆరోగ్యకరమైన, హరిత తిరుమలను అందిస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!