

కృత్రిమ మేధతో భవిష్యత్తులో మానవాళికి ముప్పు పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. ఏఐ ప్రపంచంపై ఆధిపత్యం సాధిస్తుందని, మానవాళిని నాశనం చేస్తుందన్న ప్రచారం బూటకమని ఆయన పేర్కొన్నారు. ఏఐ, డేటా సెంటర్లకు వ్యతిరేకంగా దుష్ప్రచారం జరుగుతోందని, టెక్నాలజీపై కఠిన నియంత్రణలు విధించే ప్రయత్నాలు కుట్రలో భాగమని వ్యాఖ్యానించారు. ఏఐ రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని ట్రంప్ నొక్కిచెప్పారు.
మరోవైపు ఏఐ వల్ల పెరుగుతున్న అసమానతలను తగ్గించేందుకు తక్షణ చర్యలు అవసరమని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు. ఏఐ అందరికీ అందుబాటులో ఉండేలా వచ్చే రెండేళ్లలో గేట్స్ ఫౌండేషన్ కనీసం ఒక బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కూడా ఏఐ వేగవంతమైన అభివృద్ధికి అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా పాలనా వ్యవస్థ అవసరమని చెబుతున్నారు. ప్రతి దేశానికి ఏఐ పాలనపై చర్చల్లో భాగస్వామ్యం ఉండాలని ఆయన సూచించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!