

తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనివేళల మార్పు, ఉపాధ్యాయులకు బోధనేతర విధులు అప్పగించడంపై రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ అంశాలపై ఎం. సిప్లీ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. 2024లో జారీ చేసిన జీఓ 16, అలాగే ఈ ఏడాది జూన్‌లో పనివేళల మార్పుపై జారీ చేసిన ఉత్తర్వుల్లో గురుకులాలను చేర్చాలని పిటిషనర్ కోరారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. గురుకుల పాఠశాలల పనివేళలు ఉదయం 8 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉన్నాయని, వాటిని ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మార్చాలని కోరారు. అలాగే ఉపాధ్యాయులకు స్టడీ అవర్, వార్డెన్, హాస్టల్ ఇన్‌ఛార్జి వంటి అదనపు బాధ్యతలు అప్పగించకుండా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ వివరణ కోరుతూ తదుపరి విచారణను సెప్టెంబర్ 30కి వాయిదా వేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!