7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సింగరేణి ‘మారుపేర్ల’ సమస్యకు పరిష్కారం చూపిస్తాం: భట్టి విక్రమార్క

Writer: Chandrika 02:32 PM, 7 సెప్టెంబర్, 2026
సింగరేణి ‘మారుపేర్ల’ సమస్యకు పరిష్కారం చూపిస్తాం: భట్టి విక్రమార్క

సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (SCCL)లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ‘మారుపేర్ల’ సమస్యను మానవీయ కోణంలో పరిశీలిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. శాసనమండలిలో ఈ అంశంపై మాట్లాడుతూ.. 1990వ దశకం నుంచి, ముఖ్యంగా 1997 నుంచి ఈ సమస్య కొనసాగుతోందని వివరించారు. అధికారిక రిజిస్టర్‌లో ఒకరి పేరు ఉండగా.. వారి స్థానంలో మరొకరు విధులు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. చట్టపరంగా ఇది తీవ్రమైన అంశమైనప్పటికీ.. కార్మికుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గతంలో సింగరేణి యాజమాన్యం మానవీయ కోణంలో పరిష్కరించేందుకు ప్రయత్నించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సమస్యపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసిందని, దాని సిఫార్సుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

సింగరేణిలో ప్రస్తుతం దాదాపు 90 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. ‘మారుపేర్ల’ సమస్యను ఎదుర్కొంటున్న వారి సంఖ్య 128 మాత్రమేనని భట్టి విక్రమార్క తెలిపారు. సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ చట్టపరమైన చిక్కులు ఉండటంతో అధికారులు నిర్ణయం తీసుకోవడంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఒకవైపు భవిష్యత్తులో నిబంధనల ప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న అధికారుల ఆందోళన, మరోవైపు సమస్యను పరిష్కరించాలని ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను ప్రభుత్వం పరిశీలించిందన్నారు. ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఏ ఒక్క అధికారిపైనా భారం పడకుండా కమిటీ ద్వారా సమగ్రంగా పరిశీలించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కమిటీ నివేదిక వచ్చిన అనంతరం 128 మంది ‘మారుపేర్ల’ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డీఎంకేపై సీఎం విజయ్ సంచలన ఆరోపణలు

డీఎంకేపై సీఎం విజయ్ సంచలన ఆరోపణలు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్‌ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్‌ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు

బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం..

బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం..

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ‘దుద్దిళ్ల శ్రీపాద రావు సెంట్రల్‌ హాల్‌’ ప్రారంభం..

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ‘దుద్దిళ్ల శ్రీపాద రావు సెంట్రల్‌ హాల్‌’ ప్రారంభం..

క్రాకటోవా విస్ఫోటం.. 301 విమాన సర్వీసులకు బ్రేక్‌!

క్రాకటోవా విస్ఫోటం.. 301 విమాన సర్వీసులకు బ్రేక్‌!

అసెంబ్లీ ముట్టడికి బీజేపీ యత్నం...రాంచందర్ రావు అరెస్ట్

అసెంబ్లీ ముట్టడికి బీజేపీ యత్నం...రాంచందర్ రావు అరెస్ట్

ట్యాగ్లు
సింగరేణి కాలరీస్ఎస్‌సీసీఎల్భట్టి విక్రమార్కతెలంగాణ ప్రభుత్వంతెలంగాణ శాసనమండలిమారుపేర్ల సమస్యసింగరేణి ఉద్యోగులుబొగ్గు కార్మికులుతెలంగాణ రాజకీయాలుఉద్యోగుల సమస్యలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10లోకి త్రిగుణ్..‘2.0’తో ప్రేక్షకులను మెప్పిస్తాడా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లోకి త్రిగుణ్..‘2.0’తో ప్రేక్షకులను మెప్పిస్తాడా?

బిగ్ బాస్ హౌస్‌లో సుధీర్ రెడ్డి.. తనదైన శైలిలో మెప్పిస్తాడా?
షోస్

బిగ్ బాస్ హౌస్‌లో సుధీర్ రెడ్డి.. తనదైన శైలిలో మెప్పిస్తాడా?

సీరియల్స్ నుంచి బిగ్ బాస్ వరకు.. చైత్ర రాయ్ కొత్త జర్నీ
షోస్

సీరియల్స్ నుంచి బిగ్ బాస్ వరకు.. చైత్ర రాయ్ కొత్త జర్నీ

ఇళయరాజా చేతుల మీదుగా ‘మంజనతి’ షూటింగ్‌ ప్రారంభం
సినిమాలు

ఇళయరాజా చేతుల మీదుగా ‘మంజనతి’ షూటింగ్‌ ప్రారంభం

బిగ్ బాస్‌తో మరో ఇన్నింగ్స్ ప్రారంభించిన టెంపర్ వంశీ...
షోస్

బిగ్ బాస్‌తో మరో ఇన్నింగ్స్ ప్రారంభించిన టెంపర్ వంశీ...

యాపిల్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
టెక్నాలజీ

యాపిల్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

‘షాక్’తో పరిణీతి చోప్రా ఓటీటీ ఎంట్రీ
ఓటీటీ

‘షాక్’తో పరిణీతి చోప్రా ఓటీటీ ఎంట్రీ

దుల్కర్-పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’కి భారీ ఓటీటీ డీల్...
ఓటీటీ

దుల్కర్-పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’కి భారీ ఓటీటీ డీల్...

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కి రౌడీ బాయ్
సినిమాలు

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కి రౌడీ బాయ్

డీఎంకేపై సీఎం విజయ్ సంచలన ఆరోపణలు
జనరల్

డీఎంకేపై సీఎం విజయ్ సంచలన ఆరోపణలు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్‌ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్‌ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు

కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’ డైరెక్టర్
సినిమాలు

కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’ డైరెక్టర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!