

ఇండోనేషియాలోని అనక్ క్రాకటోవా అగ్నిపర్వతం భారీగా విస్ఫోటం చెందింది. ఈ ఘటనతో పెద్ద మొత్తంలో అగ్నిపర్వత బూడిద వాతావరణంలోకి చేరింది. బూడిద మేఘాలు సుమారు 20 వేల నుంచి 50 వేల అడుగుల ఎత్తు వరకు ఎగసినట్లు సమాచారం. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జకార్తాతో పాటు ఆరు విమానాశ్రయాలను మూసివేశారు. మొత్తం 301 విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడగా.. వాటిలో 58 అంతర్జాతీయ సర్వీసులు ఉన్నట్లు తెలుస్తోంది.
అనక్ క్రాకటోవా అగ్నిపర్వతానికి గతంలోనూ భారీ విపత్తులకు కారణమైన చరిత్ర ఉంది. 2018లో ఈ అగ్నిపర్వతం విస్ఫోటం తర్వాత సుండా జలసంధి పరిసర ప్రాంతాలను సునామీ ముంచెత్తింది. ఈ ఘటనలో సుమారు 430 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా విస్ఫోటంతో మరోసారి అప్రమత్తమైన అధికారులు.. అగ్నిపర్వత కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా బూడిద మేఘాల కారణంగా విమానయాన రంగంపై ప్రభావం కొనసాగుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!