
రాజకీయాలు

డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు చెన్నై పోర్టులో భారీగా చైనా మూలానికి చెందిన బాణసంచాను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బాణసంచా విలువ రూ.12 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు గుర్తించారు. నిర్దిష్ట నిఘా సమాచారంతో అధికారులు కంటైనర్లను తనిఖీ చేయగా ఈ అక్రమ దిగుమతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
డీఆర్ఐకు అందిన సమాచారం ప్రకారం, బాణసంచాను నేరుగా బాణసంచాగా ప్రకటించకుండా వివిధ వస్తువుల పేరుతో కంటైనర్లలో దిగుమతి చేస్తున్నట్లు గుర్తించారు. స్టేషనరీ వస్తువులు, మెడికల్ గ్లోవ్స్, ప్లాస్టిక్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, స్టోరేజ్ వార్డ్‌రోబ్స్, షూ ర్యాక్స్ తదితర వస్తువులుగా తప్పుడు వివరాలు నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. అక్రమ దిగుమతులను అడ్డుకోవడంలో భాగంగా డీఆర్ఐ అధికారులు ఈ చర్యలు చేపట్టారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!