

ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో ఫేజ్–2 ప్రాజెక్టుకు అనుమతులు పొందేందుకు ఢిల్లీకి బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలుసుకుని ప్రాజెక్టుకు త్వరగా ఆమోదం ఇవ్వాలని కోరనున్నారు. హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను కేంద్రానికి సమర్పించింది.
ఫేజ్–2లో మొత్తం 7 మార్గాలు ప్రతిపాదించగా, 122.9 కిలోమీటర్ల మేర విస్తరణ చేయాలని యోచిస్తున్నారు. మొత్తం 86 స్టేషన్లు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.38,595 కోట్లు. ప్రస్తుతం 69.2 కిలోమీటర్లుగా ఉన్న ఫేజ్–1 నెట్‌వర్క్, ఫేజ్–2 పూర్తయ్యాక 191.9 కిలోమీటర్లకు పెరుగుతుంది. నగర విస్తరణ, పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, విమానాశ్రయ అనుసంధానం అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ విస్తరణకు ప్రాధాన్యత ఇస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!