

రాష్ట్రవ్యాప్తంగా యూరియా అమ్మకాలపై నిషేధం విధించడం రైతులకు అన్యాయం అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఉప సభాపక్ష నాయకుడు హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. స్టాక్ ఉన్నప్పటికీ డీలర్లు, వ్యవసాయ కేంద్రాలు, సహకార సంఘాల్లో రైతులకు యూరియా అందకుండా ఉండటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని అన్నారు. యూరియా కోసం రైతులు తిరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన ఆరోపించారు.
యూరియా అమ్మకాలు నిలిపివేయడం వల్ల చెరకు, పండ్ల తోటలు, కూరగాయలు పండించే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాల్సింది పోయి, సమస్యలను మరింత పెంచే విధంగా యాప్‌ను తీసుకువచ్చారని విమర్శించారు. ఎరువుల ధరలు పెరగడం, యూరియాపై నిషేధం విధించడం వల్ల రైతులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని, ఇలాంటి సమయంలో ఉత్సవాలు నిర్వహించడం రైతులను అవమానించడమే అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!