
జనరల్

మంచిర్యాల జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద వర్షాలు, ఈదురుగాలుల కారణంగా గోడలు కూలి నాలుగు మంది రైతులు మరణించగా, పలువురు గాయపడిన ఘటనపై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు రైతుల భద్రతపై తీవ్రమైన సందేహాలను రేకెత్తిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతూ, వారికి వెంటనే రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. రైతులు వారాల తరబడి కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. మూడు రోజుల్లో ఏడుగురు రైతులు మరణించడం ప్రభుత్వ వైఫల్యమేనని పేర్కొంటూ, రాష్ట్రవ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో పంటలను వెంటనే కొనుగోలు చేయాలని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!