

ఇటీవల లక్షా యాభై వేల రూపాయల స్థాయి కంటే దిగువకు వచ్చిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు తాజాగా మరింత తగ్గాయి. దీంతో బంగారం కొనాలనుకునే వారికి కొంత ఉపశమనం లభిస్తోంది. అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల వల్ల ఏర్పడిన అనిశ్చితి కారణంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది.
ఈరోజు ఉదయం పరిస్థితి ప్రకారం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,49,170గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,36,740గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,49,220గా, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,36,890గా ఉంది.
అదే సమయంలో వెండి ధర కూడా స్వల్పంగా తగ్గి కిలోకు వంద రూపాయల మేర తగ్గుదల నమోదు చేశాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,64,900గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,54,900గా ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.2,64,900గా, బెంగళూరులో రూ.2,54,900గా ఉంది.
గమనిక: బంగారం కొనుగోలు చేసే ముందు ఈరోజు ధరలను తప్పనిసరిగా పరిశీలించండి. మార్కెట్ మార్పులను గమనించి సరైన సమయంలో కొనుగోలు చేయండి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!