

చెన్నైకి చెందిన డీప్‌టెక్ స్టార్టప్ ది ఇప్లేన్ కంపెనీ పూర్తి స్థాయి విద్యుత్ విమాన టాక్సీ e200X అసెంబ్లీని విజయవంతంగా పూర్తి చేసింది. విమానంలోని ప్రధాన ఉపవ్యవస్థలను ఒకే ఎయిర్‌ఫ్రేమ్‌లో సమీకరించి రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ విమానం ఇప్పుడు గ్రౌండ్ టెస్టింగ్ దశలోకి ప్రవేశించనుంది. ఈ పరీక్షల్లో విమాన నిర్మాణ బలం, ఏరోడైనమిక్ పనితీరు, ఆన్‌బోర్డ్ వ్యవస్థల సామర్థ్యాన్ని పరిశీలించిన అనంతరం డీజీసీఏ నుంచి టైప్ సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేయనున్నారు.
ఇప్పటికే తొలి ప్రోటోటైప్ (PT-01)ను పూర్తి చేసిన సంస్థ, e200Xను డిజైన్ మరియు సిమ్యులేషన్ దశ నుంచి భౌతిక పరీక్షల దశకు తీసుకొచ్చింది. ఈ విమానాన్ని నగరాల్లో ప్రయాణికుల రవాణా, సరుకు రవాణా, ఎయిర్ అంబులెన్స్ సేవల కోసం అభివృద్ధి చేశారు. మొదట వాణిజ్య సరకు రవాణా సేవలను ప్రారంభించి, అవసరమైన అనుమతులు లభించిన తర్వాత ప్రయాణికులు మరియు వైద్య సేవల్లోకి తీసుకురానున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు 21 మిలియన్ డాలర్లు (సుమారు రూ.200 కోట్లు) సమీకరించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!