
క్రీడలు

తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్డీ టోకెన్ల జారీ సమయాలను తిరుమల తిరుపతి దేవస్థానం మార్పు చేసింది. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటివరకు అర్ధరాత్రి సమయంలో టోకెన్లు జారీ చేయగా, ప్రస్తుతం సెలవులు ముగియడంతో భక్తుల రద్దీ తగ్గిన నేపథ్యంలో సాధారణ షెడ్యూల్ను తిరిగి అమలు చేస్తున్నారు.
ఇప్పటి నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం 2:00 గంటల నుంచి 4:00 గంటల వరకు ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేయనున్నారు. భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నిలయం, అలిపిరి భూదేవి సముదాయాల్లో టోకెన్లు పొందవచ్చు. ఈ మార్పుతో భక్తులకు మరింత సౌలభ్యం కలగడంతో పాటు దర్శన వ్యవస్థ సక్రమంగా నిర్వహించబడుతుందని అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!