

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర భవిష్యత్తును మార్చే కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో విశాఖ రైల్వే జోన్, పోలవరం, అమరావతి వంటి కీలక ప్రాజెక్టులు ముందుకు సాగాయని పేర్కొంటూ, రాష్ట్ర పునర్నిర్మాణానికి ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని చెప్పారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి భారీ ప్రణాళికలు అమలులో ఉన్నాయని చంద్రబాబు వెల్లడించారు. రూ.6.13 లక్షల కోట్ల పెట్టుబడులతో 189 ప్రాజెక్టులు రాబోతున్నాయని, వాటి ద్వారా 5.57 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. మూడు సంవత్సరాల్లో రూ.2,784 కోట్లతో ఎనిమిది ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, నేరడి బ్యారేజీకి అనుమతులు వచ్చాయని, గోదావరి నీటిని అనకాపల్లికి తీసుకువచ్చే పనులు ప్రారంభమవుతున్నాయని వెల్లడించారు. పర్యాటకం, ఫార్మా, ఖనిజ సంపద, జాతీయ రహదారులు, ఆధునిక మౌలిక వసతులతో ఉత్తరాంధ్రను పెట్టుబడులు, ఉపాధికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!