

కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు పర్యటించనున్నారు. జల్ జీవన్ మిషన్ 2.0–అమరజీవి జలధార కార్యక్రమంలో భాగంగా రూ.30,156 కోట్లతో చేపట్టనున్న పనులకు వారు శ్రీకారం చుట్టనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించడంతో పాటు ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ద్వారా సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని గ్రామీణ కుటుంబాలకు ఇంటింటికీ మంచినీరు అందించే కార్యక్రమాన్ని ప్రొద్దుటూరు నుంచి ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు తాగునీటి కుళాయి కనెక్షన్లు అందించనున్నారు. కొత్తపల్లి గ్రామంలో పైలాన్‌ను ఆవిష్కరించిన అనంతరం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!