

ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. పశ్చిమ ఆసియా సంక్షోభం సమయంలో విధించిన పరిమితులను తొలగిస్తూ, నాన్-డొమెస్టిక్ ప్యాక్డ్ ఎల్పీజీ సరఫరాను మునుపటి స్థాయికి పునరుద్ధరించింది. అలాగే పూర్తిగా నిలిపివేసిన బల్క్ ఎల్పీజీ సరఫరాను 50 శాతం మేర తిరిగి ప్రారంభించింది. దేశీయ ఉత్పత్తి పెరగడం, దిగుమతి కార్గోలు అందుబాటులో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఎల్పీజీ లభ్యతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రోజుకు కనీసం 40 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని కొనసాగించనున్నారు. అదనంగా అందుబాటులోకి వచ్చిన C3-C4 స్ట్రీమ్స్‌ను పెట్రోకెమికల్ మరియు ఇతర పరిశ్రమలకు కేటాయించనున్నారు. వలస వినియోగదారులు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలకు ఈ నిర్ణయం ఊరటనివ్వనుండగా, పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్టివిటీ విస్తరణకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. దేశ ఇంధన భద్రతను కాపాడుతూ పరిశ్రమల అవసరాలను తీర్చడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!