
ఓటీటీ

ఈరోజు విడుదలైన తెలుగు చిత్రాల్లో ‘KJQ (కింగ్ జాకీ క్వీన్)’ ఒకటి. దివంగత కిరణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ డ్రామాలో దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా ప్రధాన పాత్రల్లో నటించారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి పూర్ణచంద్ర తేజస్వి సంగీతం అందించారు.
థియేట్రికల్ రిలీజ్‌తో పాటు చిత్రబృందం ‘KJQ’ ఓటీటీ భాగస్వామిని కూడా అధికారికంగా ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. అయితే ఓటీటీ ప్రీమియర్ తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ది ప్యారడైజ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సోదరుడు శశి ఓదెల ఈ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!