
సినిమాలు

దేశంలో నీట్ పేపర్ లీక్ వివాదం కొనసాగుతున్న సమయంలో సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్ పోర్టల్ హ్యాక్ అయ్యిందని వచ్చిన వార్తలు తీవ్ర చర్చకు దారి తీశాయి. 19 ఏళ్ల యువకుడు సీబీఎస్‌ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్‌ను హ్యాక్ చేశానని ప్రకటించడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే పోర్టల్ క్రాష్ కావడం, ఆన్సర్ షీట్లు బ్లర్ కావడం వంటి సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
అయితే సీబీఎస్‌ఈ ఈ ఆరోపణలను ఖండిస్తూ స్పష్టత ఇచ్చింది. హ్యాకర్ టార్గెట్ చేసినది అసలు రీవాల్యుయేషన్ పోర్టల్ కాదని, కేవలం డమ్మీ లేదా టెస్టింగ్ ప్లాట్‌ఫామ్ మాత్రమేనని తెలిపింది. ఆన్‌లైన్‌లో షేర్ చేసిన డేటా శాంపిల్ సమాచారమేనని, అధికారిక డేటా ఏదీ లీక్ కాలేదని బోర్డు వెల్లడించింది. తప్పుడు ప్రచారంపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!