
సినిమాలు

రేవునగరిలో సివిల్ కాంట్రాక్టులు చేస్తున్న ఓ పారిశ్రామికవేత్తను హనీట్రాప్‌లో ఇరికించి రూ.2.77 కోట్లు వసూలు చేసిన ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. ఉర్వ ఠాణా పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో దక్షిణ కన్నడ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నిజాం అలియాస్ ఇబ్రహీం, అతని మిత్రుడు జితేశ్ ఉన్నారు.
అందమైన యువతితో పరిచయం పెంచి, తర్వాత వ్యక్తిగత ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసి మరిన్ని రూ.35 లక్షలు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. భయపడి బాధితుడు రూ.20 లక్షలు నగదు, రూ.15 లక్షల చెక్కు ఇచ్చాడు. ఆ చెక్కు బౌన్స్ కావడంతో బెదిరింపులు కొనసాగాయి. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!