
జనరల్

మాస్ మహారాజ రవితేజ హీరోగా, ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇరుముడి సినిమా డిసెంబర్‌కు వాయిదా పడిందన్న ప్రచారానికి తెరపడింది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు, రవితేజ సన్నిహిత వర్గాలు ఈ సినిమా ఆగస్టు 21న అనుకున్న తేదీకే థియేటర్లలో విడుదల కానుందని స్పష్టం చేశాయి. ప్రకటించిన నాటి నుంచే ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ పరిమితంగానే ఉన్నప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. విడుదలకు సమయం తక్కువగా ఉండటంతో ఇకపై వరుస అప్డేట్లు, ప్రమోషన్లతో సినిమాపై మరింత హైప్ పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, అభిమానులు విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!