
జనరల్

ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించేలా అధికారులు కృషి చేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సూచించారు. సచివాలయంలో జిల్లా విద్యాశాఖాధికారులు, ఏపీసీలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. హాజరు శాతం, మౌలిక వసతులు, పదో తరగతి ఫలితాలు, మధ్యాహ్న భోజన పథకం అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
ప్రతి విద్యార్థిని తప్పకుండా ట్రాక్ చేయాలని, డ్రాపౌట్లను తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. వలస వెళ్లే విద్యార్థుల చదువు కొనసాగించేలా వ్యవస్థను బలోపేతం చేయాలని తెలిపారు. జిల్లాల పనితీరును సమీక్షిస్తూ విద్యా నాణ్యతను మెరుగుపరచాలని పేర్కొన్నారు. అధికారులు జిల్లాల స్థాయిలో హాజరు శాతం, నమోదు ప్రక్రియ, ఫలితాలపై వివరాలు అందించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!