
సినిమాలు

తెలంగాణలో రైతుల సమస్యలపై పోరాటానికి భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది. “రైతు ఘోష – బీజేపీ భరోసా” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పార్టీ నాయకులు మూడు రోజుల పాటు సందర్శించనున్నారు.
రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు నేతృత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రైతులతో సమావేశమై సమస్యలను తెలుసుకోనున్నారు. ఈ రోజు వికారాబాద్ జిల్లా కులకచర్లలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డును సందర్శించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!