

బెంగళూరులోని ఒలా ఎలక్ట్రిక్లో పనిచేస్తున్న కె. అరవింద్ (38) సెప్టెంబర్ 28న తన ఇంట్లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరణానికి ముందు ఆయన రాసిన 28 పేజీల సూసైడ్ నోట్‌లో, ఒలా ఫౌండర్ భవిష్ అగర్వాల్ సహా ఉన్నతాధికారులు ఆయనను మానసికంగా వేధించారని, జీతాలు, అలవెన్స్‌లను ఇవ్వకుండా దోపిడీ చేసారని ఆరోపించారు.అరవింద్ 2022 నుండి హోమొలొగేషన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. విషం తాగిన వెంటనే ఆసుపత్రికి తరలించినా, అదే రోజు ఆయన చనిపోయారు. ఆ తర్వాత ఆయన సోదరుడు 28 పేజీల నోట్‌ను కనుగొన్నాడు, అందులో సుబ్రత్ కుమార్ దాస్ మరియు భవిష్ అగర్వాల్పై మానసిక వేధింపులు, జీతాల సమస్యలు, అవమానాలు జరిగాయని పేర్కొన్నారు.
అరవింద్ మరణం రెండు రోజుల తర్వాత, ఆయన అకౌంటులో ₹17.46 లక్షలు అనుమానాస్పదంగా ట్రాన్స్‌ఫర్ అయ్యాయని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంపెనీ అధికారులు సరైన వివరణ ఇవ్వకపోవడంతో, కుటుంబం పోలీసులు దగ్గరకు వెళ్లారు.అక్టోబర్ 6న, పోలీసులు భవిష్ అగర్వాల్, దాస్ మరియు ఇతర అధికారులపై FIR నమోదు చేసి, నిరంతర వేధింపులు, అవమానాలు మరియు ఆర్థిక దోపిడీ కారణంగానే అరవింద్ ఆత్మహత్యకు గురయ్యారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు బాధ్యులపై చట్టపరమైన చర్యలు కోరుతున్నారు.ఒలా కంపెనీ అరవింద్ మరణం పై విచారం వ్యక్తం చేస్తూ, ఆయన ఉద్యోగం లేదా వేధింపుల గురించి ఎలాంటి ఫిర్యాదు రాసినట్టు లేదని పేర్కొంది. అరవింద్‌కు ఫౌండర్‌తో ప్రత్యక్ష సంభాషణలూ ఉండలేదని కూడా క్లారిటీ ఇచ్చింది. ఒలా FIR ను కర్ణాటక హైకోర్టులో సవాలు చేసింది, అధికారులు రక్షణ ఉత్తర్వులు పొందారు.
అయితే, కుటుంబం అరవింద్‌కు న్యాయం జరగాలని మరియు కార్పొరేట్ వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!