

నీట్ పరీక్షలో అక్రమాల ఆరోపణలు వెలుగులోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించి చర్యలు ప్రారంభించిందని బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆమె, ఆరోపణలు వెలుగులోకి వచ్చిన రోజే విద్యాశాఖ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును సీబీఐకి అప్పగించిందని చెప్పారు. అనంతరం సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసి 13 మంది నిందితులను అరెస్ట్ చేసిందని, కేసు విచారణను వేగవంతం చేయాలని కోర్టును కూడా కోరినట్లు వెల్లడించారు.
విద్యార్థుల భవిష్యత్తును కాపాడటమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బన్సూరి స్వరాజ్ స్పష్టం చేశారు. మరోవైపు, నీట్ వివాదం, విద్యార్థుల నిరసనలు, పోలీసుల చర్యలపై ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!