
జనరల్

అకాల వర్షాలు, ఈదురు గాలులతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడ్లు దెబ్బతింటున్నా ప్రభుత్వం స్పందించడం లేదని బండి సంజయ్ విమర్శించారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కొనుగోళ్లు సరిగా జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతుల కష్టాలు నీళ్లపాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి గింజ కొనుగోలుకు కేంద్రం నిధులు అందిస్తున్నప్పటికీ రాష్ట్రం ఎందుకు నిర్లక్ష్యం చూపుతోందని ప్రశ్నించారు. రవాణా ఖర్చులు, ఇతర వ్యయాలు కూడా కేంద్రం భరిస్తున్నదని పేర్కొన్నారు. అయినా వడ్ల కొనుగోళ్లు నెమ్మదిగా సాగడం దురదృష్టకరమని అన్నారు. తడిసిన వడ్లను కూడా కనీస మద్దతు ధరకు వెంటనే కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!