

కఠినమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కేసుల్లో కూడా “బెయిల్నే నిబంధన, జైలు మినహాయింపు” అనే రాజ్యాంగ సూత్రం వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్‌కు చెందిన నార్కో టెర్రర్ కేసులో నిందితుడు సయ్యద్ ఇఫ్తిఖార్ అండ్రాబీకి బెయిల్ మంజూరు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
విచారణ ఆలస్యం కారణంగా వ్యక్తిని నిరవధికంగా జైలులో ఉంచలేమని జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం పేర్కొంది. అండ్రాబీకి పాస్‌పోర్ట్ సమర్పించాలనీ, ప్రతి 15 రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్లో హాజరుకావాలనీ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును 2020లో ఎన్ఐఏ నమోదు చేసింది.
మరో కేసులో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు న్యాయమూర్తులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే బార్ కౌన్సిళ్లలో మహిళా న్యాయవాదులకు 30 శాతం ప్రాతినిధ్యంపై వివాదాలను పరిష్కరించేందుకు రెండు ఎన్నికల ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేసింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!