

శ్రీకృష్ణుడిని జగద్గురువుగా భావించడానికి ప్రధాన కారణం ఆయన భగవద్గీత ద్వారా సమస్త మానవాళికి అందించిన జ్ఞానబోధ. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు ఎదుర్కొన్న ధర్మసంకటాన్ని తొలగిస్తూ శ్రీకృష్ణుడు కర్తవ్యం, ధర్మం, ఆత్మజ్ఞానం, భక్తి, జీవన విధానం గురించి వివరించారు. ఈ బోధనలు ఒక కాలానికి లేదా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా అన్ని తరాల వారికి వర్తించే జీవిత సత్యాలను వివరిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.
భగవద్గీతలో కృష్ణుడు ఫలితంపై ఆశక్తి లేకుండా తన కర్తవ్యాన్ని నిష్కామంగా నిర్వర్తించాలని బోధించాడు. ఆత్మకు పుట్టుక, మరణం లేవని, శరీరం మాత్రమే నశిస్తుందని వివరించాడు. కోరికలు, కోపాన్ని నియంత్రించుకోవడం, సుఖదుఃఖాలు, జయాపజయాలు, లాభనష్టాలను సమభావంతో స్వీకరించడం, స్వధర్మాన్ని పాటించడం వంటి అంశాలను వివరించాడు. అంతిమంగా పరమాత్మను శరణు వేడుతూ ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలని సూచించాడు. అందుకే శ్రీకృష్ణుడి గీతాబోధ ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు మనిషి జీవితాన్ని సరైన మార్గంలో నడిపించే మార్గదర్శకంగా భావించబడుతోంది.
గమనిక:
ఇక్కడ అందించిన వివరాలు హిందూ ధర్మగ్రంథాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు మరియు సంప్రదాయ వ్యాఖ్యానాల ఆధారంగా అందించినవి. ఇవి భక్తి, ఆధ్యాత్మిక మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ వివరాలకు ఆధునిక శాస్త్రీయ ఆధారాలు ఉండకపోవచ్చు. మరింత లోతైన అవగాహన కోసం సంబంధిత పండితులు లేదా నిపుణులను సంప్రదించవచ్చు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!