
సినిమాలు

ఆఫ్రికా దేశమైన నైజర్‌లో ఘోర ఉగ్రదాడి చోటుచేసుకుంది. గురువారం స్థానిక కాలమానం ప్రకారం రాజధాని నియామేలోని దియోరి హమాని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌తో పాటు సమీప సైనిక వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఈ ఘటనలో కనీసం 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దాడి అనంతరం భద్రతా దళాలు అప్రమత్తమై ప్రాంతాన్ని పూర్తిగా ముట్టడించాయి.
ఈ దాడికి జమాత్ నస్ర్ అల్ ఇస్లాం వల్ ముస్లిమిన్ (జేఎన్ఐఎమ్) బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంస్థ అల్ ఖైదాతో అనుబంధంగా ఉన్నట్లు అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఘటనతో ప్రాంతంలో భద్రతా పరిస్థితులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!