

మురసు తుపాను ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు, అత్యవసర కార్యక్రమాల నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం రూ.37 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. TR-27 నిబంధన కింద మొత్తం 17 జిల్లాలకు ఈ నిధులను కేటాయించింది. నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.3 కోట్ల చొప్పున కేటాయించింది. ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు, నంద్యాల జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున నిధులు విడుదల చేసింది. కడప, సత్యసాయి, అన్నమయ్య జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.కోటి చొప్పున కేటాయించింది.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడం, సురక్షిత తాగునీరు, ఆహారం, పాలు సరఫరా చేయడం, వైద్య శిబిరాల నిర్వహణ, పారిశుద్ధ్య పనులు చేపట్టడం వంటి కార్యక్రమాలకు ఈ నిధులను వినియోగించనున్నారు. అలాగే విద్యుత్ సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో పాటు దెబ్బతిన్న రహదారులు, నీటిపారుదల మౌలిక సదుపాయాలను పునరుద్ధరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!