2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈడీ భారీ సోదాలు.. వెలుగులోకి భారీ మనీలాండరింగ్‌ వ్యవహారం

Writer: Nithish 08:11 PM, 2 నవంబర్, 2026
ఈడీ భారీ సోదాలు.. వెలుగులోకి భారీ మనీలాండరింగ్‌ వ్యవహారం

విశాఖపట్నం సబ్‌ జోనల్‌ కార్యాలయం ఆధ్వర్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు దిల్లీ, కోల్‌కతాలోని ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కస్టమైజ్డ్‌ సాఫ్ట్‌వేర్‌ దిగుమతుల పేరుతో నకిలీ పత్రాలు, ఫోర్జరీ ఇన్వాయిస్‌లను ఉపయోగించి విదేశాలకు అక్రమంగా నిధులు తరలించినట్లు ఈడీ గుర్తించింది. వడ్డీ మహేశ్‌, అతడి తండ్రి, మరికొందరు కలిసి కోల్‌కతాలో పలు షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఈ కంపెనీల ద్వారా సింగపూర్‌, హాంకాంగ్‌, చైనాలోని ఐదు సంస్థలకు రూ.569.03 కోట్లు బదిలీ చేసినట్లు ఈడీ గుర్తించింది. 2014 నుంచి 2017 మధ్య షెల్‌ కంపెనీల బ్యాంకు ఖాతాల ద్వారా ఈ లావాదేవీలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. ఈ కేసులో మొత్తం రూ.1,500 కోట్ల మేర నేరపూరిత ఆర్థిక లావాదేవీలు జరిగి ఉండవచ్చని అంచనా వేస్తోంది. సోదాల్లో రూ.47 లక్షల లెక్కచూపని నగదుతో పాటు 5,900 అమెరికన్‌ డాలర్లు, 2,200 యూఏఈ దిర్హామ్‌లు, 5,600 చైనా కరెన్సీ, కీలక పత్రాలు, ఆస్తి డాక్యుమెంట్లు, డిజిటల్‌ పరికరాలను స్వాధీనం చేసుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హిందీ టీవీ నటుడు అనుజ్ ఠాకూర్ కన్నుమూత

హిందీ టీవీ నటుడు అనుజ్ ఠాకూర్ కన్నుమూత

రష్యాలో చిక్కుకున్న విశాఖ యువకులు

రష్యాలో చిక్కుకున్న విశాఖ యువకులు

ఏపీ తీరంవైపు దూసుకొస్తున్న మురసు తీవ్ర తుపాను.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

ఏపీ తీరంవైపు దూసుకొస్తున్న మురసు తీవ్ర తుపాను.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

మురసు తుపాను బాధిత జిల్లాలకు నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

మురసు తుపాను బాధిత జిల్లాలకు నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

తాడిచెర్ల-I ఓపెన్‌కాస్ట్ గనికి మరోసారి 5-స్టార్ రేటింగ్ అవార్డు

తాడిచెర్ల-I ఓపెన్‌కాస్ట్ గనికి మరోసారి 5-స్టార్ రేటింగ్ అవార్డు

హైదరాబాద్‌ను పరిశుభ్ర, ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌ను పరిశుభ్ర, ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్ రెడ్డి

ట్యాగ్లు
ఈడీ సోదాలుమనీలాండరింగ్ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్విశాఖపట్నం ఈడీషెల్ కంపెనీలువిదేశీ నగదు బదిలీలునకిలీ ఇన్వాయిస్‌లువడ్డీ మహేశ్కోల్‌కతా సోదాలుఅక్రమ ఆర్థిక లావాదేవీలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హిందీ టీవీ నటుడు అనుజ్ ఠాకూర్ కన్నుమూత
జనరల్

హిందీ టీవీ నటుడు అనుజ్ ఠాకూర్ కన్నుమూత

రష్యాలో చిక్కుకున్న విశాఖ యువకులు
జనరల్

రష్యాలో చిక్కుకున్న విశాఖ యువకులు

ఏపీ తీరంవైపు దూసుకొస్తున్న మురసు తీవ్ర తుపాను.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
జనరల్

ఏపీ తీరంవైపు దూసుకొస్తున్న మురసు తీవ్ర తుపాను.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

దేశీయ బొగ్గు ఉత్పత్తిలో 42 శాతం వృద్ధి
బిజినెస్

దేశీయ బొగ్గు ఉత్పత్తిలో 42 శాతం వృద్ధి

ఈడీ భారీ సోదాలు.. వెలుగులోకి భారీ మనీలాండరింగ్‌ వ్యవహారం
జనరల్

ఈడీ భారీ సోదాలు.. వెలుగులోకి భారీ మనీలాండరింగ్‌ వ్యవహారం

ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా తిలక్‌ వర్మ
క్రీడలు

ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా తిలక్‌ వర్మ

‘మైసా’ నుంచి ‘ఓ మైసా’ పాట విడుదల
సినిమాలు

‘మైసా’ నుంచి ‘ఓ మైసా’ పాట విడుదల

మురసు తుపాను బాధిత జిల్లాలకు నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
జనరల్

మురసు తుపాను బాధిత జిల్లాలకు నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

తాడిచెర్ల-I ఓపెన్‌కాస్ట్ గనికి మరోసారి 5-స్టార్ రేటింగ్ అవార్డు
జనరల్

తాడిచెర్ల-I ఓపెన్‌కాస్ట్ గనికి మరోసారి 5-స్టార్ రేటింగ్ అవార్డు

హైదరాబాద్‌ను పరిశుభ్ర, ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

హైదరాబాద్‌ను పరిశుభ్ర, ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్ రెడ్డి

ఎస్‌ఐఆర్‌పై అవగాహన కోసం హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌పై అవగాహన కోసం హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర

న్యూజిలాండ్ సిరీస్‌లో నమన ధీర్ మెరుపులు.. టీమిండియా నుంచి ప్రత్యేక గుర్తింపు
క్రీడలు

న్యూజిలాండ్ సిరీస్‌లో నమన ధీర్ మెరుపులు.. టీమిండియా నుంచి ప్రత్యేక గుర్తింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!