

హైదరాబాద్‌లోని మియాపూర్ భూవివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండల పరిధిలోని మియాపూర్‌లో సర్వే నంబర్లు 100, 101 కింద ఉన్న 550 ఎకరాలకు పైగా భూములకు సంబంధించి ప్రైవేట్ వ్యక్తులు దాఖలు చేసిన అప్పీళ్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ భూములపై కొనసాగుతున్న వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో రాష్ట్రానికి ఊరట లభించినట్లయింది.
జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ భూములు పూర్తిగా ప్రభుత్వానికి చెందినవేనని స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రైవేట్ వ్యక్తుల వాదనలను తిరస్కరిస్తూ అప్పీళ్లను కొట్టివేయడంతో మియాపూర్ భూముల యాజమాన్యంపై కొనసాగుతున్న న్యాయపోరాటంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ తీర్పు హైదరాబాద్‌లోని విలువైన భూములకు సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్య వివాదాల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!