2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌ను పరిశుభ్ర, ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్ రెడ్డి

Writer: Shivani K 04:58 PM, 2 నవంబర్, 2026
హైదరాబాద్‌ను పరిశుభ్ర, ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌ను పరిశుభ్రమైన నగరంగా, ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో నగర పరిశుభ్రత, చెత్త సేకరణ, గ్రీన్ వాటర్ సరఫరా, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై చర్చించారు. నగరంలో ఎక్కడా చెత్త పేరుకుపోకుండా నిరంతరం పర్యవేక్షించాలని, ప్రతిరోజూ ఇంటింటికీ చెత్త సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిర్మాణ వ్యర్థాల తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పారిశ్రామిక ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం పారిశ్రామిక ప్రాంతాల స్థానిక సంస్థల అధికారులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.

నిర్మాణ పనులు, పార్కుల నిర్వహణ, పచ్చదనం అభివృద్ధి, తోటల పెంపకం వంటి అవసరాలకు మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా గ్రీన్ వాటర్ ట్యాంకర్లపై అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. తాగునీటికి బదులుగా శుద్ధి చేసిన నీటిని ఉపయోగించడం ద్వారా నీటిని ఆదా చేయవచ్చని పేర్కొన్నారు. తొలి విడతలో 19 మురుగునీటి శుద్ధి కేంద్రాల నుంచి 28 గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు గుర్తుచేశారు. జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోనూ ఈ సేవలను విస్తరించాలని సూచించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు అవసరమైన చోట్ల అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, సాధ్యమైనంత వరకు సిగ్నళ్ల వద్ద వాహనాలు నిలిచిపోకుండా రాకపోకలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. సృజన తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాప్తాడు హేమంత్‌పై పోలీసుల కాల్పులు.. ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు

రాప్తాడు హేమంత్‌పై పోలీసుల కాల్పులు.. ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు

దీపావళికి గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీంకోర్టు అనుమతి

దీపావళికి గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీంకోర్టు అనుమతి

భాజపా అభ్యంతరంతో దియా మీర్జా దీపావళి వీడియోను తొలగించిన బీఎంసీ

భాజపా అభ్యంతరంతో దియా మీర్జా దీపావళి వీడియోను తొలగించిన బీఎంసీ

హైదరాబాద్‌ మెట్రో రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు

హైదరాబాద్‌ మెట్రో రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు

మురాసు తుఫాను బీభత్సం.. ఏపీ పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ

మురాసు తుఫాను బీభత్సం.. ఏపీ పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ

లక్ష మంది విద్యార్థులకు ఉచిత ఏఐ శిక్షణ.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన

లక్ష మంది విద్యార్థులకు ఉచిత ఏఐ శిక్షణ.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిహైదరాబాద్ అభివృద్ధినగర పరిశుభ్రతచెత్త సేకరణట్రాఫిక్ నియంత్రణగ్రీన్ వాటర్ ట్యాంకర్లుమురుగునీటి శుద్ధి కేంద్రాలుజీహెచ్‌ఎంసీఅండర్‌పాస్‌లుఎలివేటెడ్ కారిడార్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌ను పరిశుభ్ర, ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

హైదరాబాద్‌ను పరిశుభ్ర, ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్ రెడ్డి

ఎస్‌ఐఆర్‌పై అవగాహన కోసం హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌పై అవగాహన కోసం హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర

న్యూజిలాండ్ సిరీస్‌లో నమన ధీర్ మెరుపులు.. టీమిండియా నుంచి ప్రత్యేక గుర్తింపు
క్రీడలు

న్యూజిలాండ్ సిరీస్‌లో నమన ధీర్ మెరుపులు.. టీమిండియా నుంచి ప్రత్యేక గుర్తింపు

జీవిత పాఠాలతో స్ఫూర్తినిస్తున్న షారుఖ్ ఖాన్.. అభిమానులకు ‘కింగ్’ ట్రీట్
సినిమాలు

జీవిత పాఠాలతో స్ఫూర్తినిస్తున్న షారుఖ్ ఖాన్.. అభిమానులకు ‘కింగ్’ ట్రీట్

రాప్తాడు హేమంత్‌పై పోలీసుల కాల్పులు.. ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు
జనరల్

రాప్తాడు హేమంత్‌పై పోలీసుల కాల్పులు.. ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు

బిగ్‌బాస్ 10 తెలుగు : రోహిత్ ఎలిమినేషన్‌పై అభిమానుల్లో అసంతృప్తి.. రీఎంట్రీ ఉంటుందా?
షోస్

బిగ్‌బాస్ 10 తెలుగు : రోహిత్ ఎలిమినేషన్‌పై అభిమానుల్లో అసంతృప్తి.. రీఎంట్రీ ఉంటుందా?

న్యూజిలాండ్‌పై సిరీస్ విజయం.. శ్రేయస్ అయ్యర్ ఖాతాలో చేదు కెప్టెన్సీ రికార్డు
క్రీడలు

న్యూజిలాండ్‌పై సిరీస్ విజయం.. శ్రేయస్ అయ్యర్ ఖాతాలో చేదు కెప్టెన్సీ రికార్డు

దీపావళికి గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీంకోర్టు అనుమతి
జనరల్

దీపావళికి గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీంకోర్టు అనుమతి

సెన్సెక్స్‌ పరుగులతో స్టాక్ మార్కెట్‌లో సందడి
బిజినెస్

సెన్సెక్స్‌ పరుగులతో స్టాక్ మార్కెట్‌లో సందడి

‘తుడరుమ్’ దర్శకుడితో చిరంజీవి సినిమా? కథా చర్చలు!
గాసిప్స్

‘తుడరుమ్’ దర్శకుడితో చిరంజీవి సినిమా? కథా చర్చలు!

బిగ్‌బాస్‌ 10 తెలుగు : రోహిత్ నా ఫ్రెండ్ కాదు.. అందుకే పంపించేశా - అమన్
షోస్

బిగ్‌బాస్‌ 10 తెలుగు : రోహిత్ నా ఫ్రెండ్ కాదు.. అందుకే పంపించేశా - అమన్

‘ఆదర్శ కుటుంబం’ భారీ బడ్జెట్ ఫెయిల్యూర్.. నిజమేనా ?
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ భారీ బడ్జెట్ ఫెయిల్యూర్.. నిజమేనా ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!