

ఇంగ్లండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. కొంతకాలంగా మోకాలు, చీలమండ గాయాలతో ఇబ్బంది పడుతున్న 36 ఏళ్ల వుడ్ గాయాల కారణంగా 15 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఈ సమయంలో మోచేతి శస్త్రచికిత్సతో పాటు మోకాలి ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు. ఇటీవల పెర్త్‌లో జరిగిన తొలి యాషెస్ టెస్టుతో తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చినప్పటికీ, కేవలం 11 ఓవర్లు బౌలింగ్ చేసిన తర్వాత ఎడమ మోకాలిలో వాపు రావడంతో మరోసారి మైదానం వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంగ్లండ్ తరఫున మళ్లీ బరిలోకి దిగలేకపోయాడు. వైద్యుల సూచనల మేరకు ఇక సుదీర్ఘ ఫార్మాట్ క్రికెట్ ఆడటం సాధ్యం కాదని వుడ్ వెల్లడించాడు.
తన కెరీర్‌లో గాయాలతో చేసిన పోరాటం చివరకు ముగిసిందని వుడ్ భావోద్వేగ ప్రకటన చేశాడు. “గత ఏడాది కాలంగా ఇంగ్లండ్ తరఫున ఆడాలనే నా కల నెమ్మదిగా దూరమవుతూ వస్తోంది. గాయం నుంచి కోలుకుని మళ్లీ వచ్చి విమర్శకులకు సమాధానం ఇవ్వాలని ఎప్పుడూ ప్రయత్నించాను. కానీ ఈసారి ఆ పోరాటంలో ఓడిపోయాను. ఇంగ్లండ్ తరఫున ఆడటం నేను కోరుకోగలిగిన గొప్ప గౌరవం. అదే నా కల నెరవేరిన క్షణం” అని పేర్కొన్నాడు. గాయాలను అధిగమిస్తూ పలుమార్లు జట్టులోకి తిరిగి వచ్చిన వుడ్.. చివరకు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాల్సి వచ్చింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!