

యూపీఐ ఛార్జీల విషయంలో అపోహలు, గందరగోళానికి గురికావాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ లావాదేవీలకు ఎంత మొత్తం బదిలీ చేసినా ఎలాంటి ఛార్జీ ఉండదని తెలిపింది. వ్యాపారులకు చేసే రూ.2 వేల వరకు యూపీఐ చెల్లింపులపై కూడా మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ఉండదని పేర్కొంది. జీరో-ఎండీఆర్ పరిధిలోని చిన్న వ్యాపారులపై అదనపు భారం ఉండదని స్పష్టం చేసింది.
రూ.2 వేలకుపైగా జరిగే నిర్దిష్ట వ్యాపార లావాదేవీలపైనే 0.4 శాతం ఎండీఆర్ వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. మొత్తం వ్యాపార యూపీఐ లావాదేవీల్లో సుమారు 96 శాతం ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతాయని వెల్లడించింది. ఎండీఆర్ భారాన్ని వినియోగదారులపై మోపకుండా చూడాలని బ్యాంకులకు సూచించినట్లు పేర్కొంది. ఎండీఆర్ అనేది ప్రభుత్వం లేదా ఎన్‌పీసీఐ వసూలు చేసే పన్ను కాదని, చెల్లింపుల వ్యవస్థలోని భాగస్వాముల మధ్య పంచే ఛార్జీ అని కేంద్రం వివరించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!