

మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై స్పందించారు. సినీ రంగంలో 48 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన మెగా యూత్ ఫోర్స్ ఫ్యాన్స్ మీట్‌లో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. బ్లడ్ బ్యాంక్‌లో సేకరించిన రక్తాన్ని విక్రయిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని చిరంజీవి ఖండించారు. తన జీవితంలో ఎన్నో విమర్శలు, అవమానాలు ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
సినిమాల్లో తాను తీసుకునే పారితోషికానికి సమానంగా రక్తాన్ని విక్రయించడం ద్వారా డబ్బు సంపాదించాలంటే ఎన్ని రక్తం ప్యాకెట్లు విక్రయించాల్సి వస్తుందో ఆలోచించాలని చిరంజీవి అన్నారు. ఎవరినుంచీ విరాళాలు తీసుకోకుండా తన కష్టార్జితంతోనే బ్లడ్ బ్యాంక్‌ను నిర్వహిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. సేవా కార్యక్రమంపై తప్పుడు ప్రచారం చేయడం అర్థరహితమని పేర్కొంటూ, ఇలాంటి విమర్శలను తాను పట్టించుకోనని చిరంజీవి తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!