
బిజినెస్

శ్రీకాకుళం జిల్లాలో ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. తీర ప్రాంతంలో ఈదురు గాలుల వేగం పెరగడంతో చిక్కోలు వాసులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉద్ధానం ప్రాంతంలోని కవిటి వద్ద తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందన్న సమాచారంతో తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. శ్రీకాకుళం జిల్లాకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్) బలగాలు చేరుకున్నాయి. తీర ప్రాంత పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గతంలో తుఫాన్ల ప్రభావాన్ని ఎదుర్కొన్న ఉద్ధానం ప్రాంతంలో మరోసారి భారీ వర్షాలు, బలమైన గాలుల ప్రభావం ఉండే అవకాశం ఉందని అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!