
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కింద అమలవుతున్న రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మరో మూడేళ్లు పొడిగించాలని నిర్ణయించింది. 2026 నుంచి 2029 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు మంత్రి నారా లోకేష్ సమక్షంలో విద్యాశాఖ, శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ మధ్య ఎంవోయూ కుదిరింది.
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు పోషకాహార రాగిజావ అందిస్తున్నారు. రాగిపిండి, బెల్లం పొడితో తయారయ్యే ఈ పానీయం కాల్షియం, ఐరన్‌తో సమృద్ధిగా ఉంటుంది. విద్యార్థుల ఆరోగ్యం, హాజరు, చేరికలు పెంచడం, డ్రాప్ అవుట్స్ తగ్గించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. మూడు సంవత్సరాల్లో సుమారు 80 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!