
జనరల్

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏపీ హైకోర్టు అడ్వకేట్ కాటూరు వెంకటేశ్.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనే ఆకాంక్షతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 1,530 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. ‘రాగా ఫర్ రైజ్ ఆఫ్ ఇండియా’ పేరుతో సాగిన ఈ యాత్రను రాహుల్ గాంధీ పుట్టినరోజైన జూన్ 19న ప్రారంభించారు. మొత్తం 85 రోజుల పాటు పాదయాత్ర కొనసాగింది.
యాత్రను పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు చేరుకున్న వెంకటేశ్‌ను గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు సన్మానించారు. అనంతరం ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ను వెంకటేశ్ కలవనున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!