
క్రీడలు

వెనెజువెలాలో మరోసారి భూకంపం సంభవించింది. తాజా ప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 4.9 తీవ్రతతో నమోదయ్యాయి. రెండు రోజుల క్రితం సంభవించిన వరుస భూకంపాల వల్ల దేశవ్యాప్తంగా భారీ విధ్వంసం చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ తాజా భూకంపం ప్రజల్లో మరింత ఆందోళన కలిగించింది. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ నష్టాలపై వివరాలు సేకరిస్తున్నారు.
ఇప్పటివరకు గత భూకంపాల కారణంగా 920 మంది మృతి చెందగా, 3 వేల మందికి పైగా గాయపడ్డారు. కూలిపోయిన భవనాల శిథిలాల కింద చిక్కుకున్న వేలాది మంది కోసం సహాయక బృందాలు యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సేవలు నిరంతరం అందుబాటులో ఉంచి సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!